honey health benefits
Health

Varieties in honey – Health benefits

Natural remedy ‘honey’ is one of nature’s blessings. The use of honey is not of this date. Has been in use ever since. There is evidence to suggest that wild honey was collected at the end of the Stone Age. This means that honey has been on the rise for about ten thousand years and fifty thousand years ago. In fact, the reputation of the bee’s life history is credited to the Spanish scientist Huber.

There are four types of honey 

Contents

silk honey, trumpet honey, stick honey, tuna honey. Silk honey flies are large and usually make screens for tree trunks and roofs in cities. The anthill flies build their curtains in the woods and in the ants. Sticky honey flies are small and build their small screen for tree branches. Tree nectar builds in the trunks of trees in the forest. The silk honey is a little too nutty to taste. The other three types of honey are sweet. Many people think that anthill is superior to honey.
Honey is rich in enzymes, vitamins and antioxidants …

Honey is rich in minerals such as calcium, copper, iron, magnesium, manganese, phosphorus, potassium, zinc, sulfur, sodium, silicon, thymine, riboflavin, pyridoxine, pantothenic acid, nicotenylamine, and pyroteinulum. Dark honey is rich in antioxidants and minerals. Honey is a fortified food because it contains all kinds of nutrients. There is no cholesterol in honey which provides energy. Honey colors and varieties. Yellow, gray, dark coffee, black … Some varieties of honey are indistinguishable. And every single honey will dissipate every kind of zucchini. That means honey color, aroma, flavor … all depends on the flowers that collect the honeycomb. For example, when extracting Capricorn from eucalyptus, lemon and orange flowers it has a pungent smell and taste. Many people prefer to use honey rather than sugar in cooking. The use of honey in baking products is not only flavourful but also detoxifies. Juicy honey extracted directly from the nectar without over-processing is rich in enzymes, vitamins and antioxidants.

Uses with Honey 

If we take honey to our teeth and gums on a regular basis, they will not only whiten but also cause tooth decay and tooth decay. Drink two teaspoons of honey in a cup of water before going to bed.
~ Burns, skin cancers, and hounds can quickly diminish. It works well as an ‘anti-microbial’ agent
.
Eye pain: Arthritis can be relieved by adding 2 tablespoons of honey to a cup of cinnamon.
Burning injuries: The combination of honey with turmeric and applied as a top coat will help reduce the risk of inflammatory bowel disease.
Cold, cough, sore throat: Combination of honey, peppermint powder (1 part), peppermint powder, clove powder and cumin powder helps relieve sore throat.
Lip Cracks: 1 part cream of 2 parts honey and 4 to 4 drops of rose water is applied on the lips to reduce the cracks in the lips.
Diarrhea in children: Addition of nutmeg powder to honey reduces diarrhea.
To increase immunity: 3 parts honey mixed with 1 part cinnamon powder increases immunity.
Toothache or denture: Combining 3 parts honey with 1 part cinnamon powder on top of the gums can reduce inflammation and relieve dental problems.
Obesity: Dissolve cinnamon powder in 2 glasses of water and boil until the rest of the infusion. If three teaspoons of honey are added half an hour before a meal, it will result in obesity.

To remove carcinogens:

Mix honey with almond powder and apply it on the face. It serves as a fine scrub. The dead skin cells on the skin are removed and the face becomes radiant.
To make the facial skin visually: honey (3 parts), egg white (1 part), glycerin (1 part), masurdal (red bandanna) is enough … Combine this with a face pack like face pack.
Aging: Honey is well used in aging problems. Honey improves the digestive system. Makes the body warm. Quieting the brain. Makes the skin tight. Relieves minor pains. In a jug, mix 3 cups of honey, 2 cups of cider vinegar and 1 cup of water. Drinking a cup of it every morning is healthy in old age.
Anemia: People with low red blood cells and low hemoglobin percentage may benefit from using honey. Honey on fresh greens is beneficial. Anemia gradually goes away.
Rheumatoid arthritis: 1 liter of hot water, 1 cup of honey, a cup of lemon juice and dipped in yarn helps relieve pain and swelling.
Oral odor: three quarters of a bottle filled with cider vinegar and mixed with a cup of honey. Scramble well. It should be used as a mouthwash after food. Finally flush with water. This will prevent oral odors.
Bedwetting: Young children should be given two teaspoons of honey twice a day when they are lying on the bed. Additional water should be regulated in the evening.
Sega Bulbs: Mix two spoonfuls of honey, egg white and brown flour into a paste. This should be changed until night breaks and pus is secreted.
Bronchitis, cough, and honey in hot milk or coffee or tea, or a combination to get his throat uncomfortable lung pattesinatlu being reduced to
a dry cough, a spoon of ginger juice spoon mixed with honey three putala puccukuntu If daggununci relief is available
burns: stauvadda burns, heat nillupadatanvalla burn injuries and honey Can be launched directly. Avoiding injury prevents injury.
Skin Cracks: If you are having trouble with the elbows and feet, it can be mixed with honey, lemon juice and olive oil.

When honey should not be used ….

Diabetics should not use honey in public. Honey should only be used under the supervision of Ayurvedic doctors.
Honey should not be used in conjunction with hot ingredients. Also, peppers and peppers should not be used in combination. Do not boil honey. Honey is a hot sperm so honey should not be heated directly on the flame. Honey should be used only in hot weather and in dry season. (Honey contains a variety of flowers, including poisonous flowers.)
Avoid mixing with spices, alcohol, and mustard.
Honey should not be mixed with rain water.
Honey should not be kept in the fridge. The sugar crystals are made in the fridge. In such cases it is sufficient to put in the sun. Or if the honey bottle is indirectly heated in hot water, the honey crystals dissolve and the honey regenerates.
Honey and ghee should not be taken in equal portions (conjugate).

తేనెలో రకాలు – ఆరోగ్య ప్రయోజనాలు

ప్రకృతి ప్రసాదించిన వరాల్లో సహజ సిద్ధమైన ఔషధం ‘తేనె’ ఒకటి.. ఒకప్పుడు అడవుల్లో మాత్రం లభించే ఈ తేనె ఇప్పుడు పట్టణాల్లో అదీ ఇళ్ల పెరడులో కూడా తయారవుతోంది. తేనె వాడకం ఈ నాటిది కాదు. అనాదినుంచి కూడా వాడుకలో ఉంది. శిలాయుగం చివర్లోనే అడవి తేనె సేకరణ జరిగిందని చెప్పడానికి ఆధారాలున్నాయి. అంటే సుమారు పది వేల సంవత్సరాల మొదలు, యాభై వేల సంవత్సరాల ముందునుంచి ఈ తేనె మాధుర్యాన్ని చవి చూస్తూ ఉన్నారని చెప్పవచ్చు. నిజానికి తేనెటీగ జీవన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన కీర్తి స్పెయిన్ శాస్తజ్ఞ్రుడు హ్యూబర్‌కు దక్కుతుంది.

తేనె లో నాలుగు రకాలు….

పట్టు తేనె, పుట్ట తేనె, కర్ర తేనె, తొర్ర తేనె. పట్టు తేనె ఈగలు పెద్దవిగా ఉండి, సాధారణంగా చెట్ల కొమ్మలకు, నగరాల్లో ఇళ్ళ పై కప్పులకు తెరలను నిర్మించుకుంటాయి. పుట్ట తేనె ఈగలు అడవుల్లో తమ తెరను గుహల్లోను, చీమల పుట్టల్లోను నిర్మించుకుంటాయి. కర్ర తేనె ఈగలు చిన్నవిగా ఉండి చెట్ల కొమ్మలకు తమ చిన్న తెరను నిర్మించుకుంటాయి. తొర్ర తేనె ఈగలు అడవుల్లో చెట్ల తొర్రల్లో నిర్మించుకుంటాయి. పట్టు తేనె రుచికి కొద్ది వగరుగా ఉంటుంది. మిగిలిన మూడు రకాల తేనెలు తీపిగా ఉండును. తేనె రకాల్లో పుట్ట తేనె శ్రేష్టమని చాలా మంది భావిస్తారు.

తేనెలోఎంజైములు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా…

తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు, థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్… లాంటి విటమిన్లూ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ అమైనోఆమ్లాలూ ఎంజైములూ ఉంటాయి.

ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలూ ఎక్కువగా ఉంటాయి. ఇన్ని రకాల పోషకాలున్నాయి కాబట్టే తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు.

శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. తేనెల్లో రంగులూ రకాలూ ఉంటాయి. పసుపు, బూడిద, ముదురు కాఫీ, నలుపు… ఇలా భిన్నవర్ణాలతోపాటు కొన్ని తేనెలు వర్ణవిహీనంగానూ ఉంటాయి.

అలాగే ఒక్కో తేనె ఒక్కో రకమైన రుచినీ సుగంధాన్నీ వెదజల్లుతుంటుంది. అంటే తేనె రంగు, సువాసన, రుచి… అన్నీ మధుకీటకాలు సేకరించే పూలజాతుల మీద ఆధారపడి ఉంటాయి.

ఉదాహరణకు యూకలిప్టస్, నిమ్మ, నారింజ పూల నుంచి మకరందాన్ని సేకరిస్తే అది ఘాటైన వాసననీ రుచినీ కలిగి ఉంటుంది. చాలామంది వంటలో పంచదార కన్నా తేనె వాడటానికి ఇష్టపడతారు.

బేకింగ్ ఉత్పత్తులో తేనె వాడటంవల్ల రుచిగా ఉండటంతోపాటు అవి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. పైగా ప్రాసెస్ చేయకుండా నేరుగా తేనెపట్టు నుంచి తీసిన జుంటి తేనెలో ఎంజైములు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరకుతాయి.

తేనెతో ఉపయోగాలు…

తేనెను రోజూ మన దంతాలకు, చిగుళ్ళకు పట్టించినట్లయితే అవి తెల్లగా మెరవడమే కాకుండా, దంత క్షయం , దంతాలు త్వరగా ఊడటం లాంటివి జరగవు.

ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల తేనెను కలుపుకొని పడుకోబోయే ముందు తాగితే చక్కటి నిద్ర పడుతుంది.అర గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక స్పూను తేనె, సగం నిమ్మ రసమూ కలిపి రోజూ ఉదయాన పరగడపున తాగితే అది మలబద్ధకానికి ,హైపర్ అసిడిటీకి చక్కని ఔషదంగా పని చేస్తుంది.

~ కాలిన గాయాలకీ చర్మ క్యాన్సర్లకీ పుండ్లకీ హనీ పూస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి. ఇది ‘యాంటీ మైక్రోబియల్’ ఏజెంట్‌గా చక్కగా పనిచేస్తుంది

మొటిమలు:తేనె (15 భాగాలు), దాల్చిన చెక్క పొడి (1 భాగం)… ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పూట 2వారాలపాటు ప్రయోగిస్తే మొటిమలు తగ్గుతాయి.

కళ్ల నొప్పి:2 చెంచాలు తేనెను కప్పు దాల్చిన చెక్క కషాయానికి కలిపి పుచ్చుకుంటే కీళ్లనొప్పిలో ఉపశమనం లభిస్తుంది.

కాలిన గాయాలు:తేనెకు పసుపును చేర్చి బాగా కలిపి పై పూతగా ప్రయోగిస్తే అగ్నిదగ్ధ వ్రణాలు మచ్చపడకుండా ఇనె్ఫక్షన్‌కి గురికాకుండా త్వరగా తగ్గుతాయి.

జలుబు, దగ్గు, గొంతునొప్పి:తేనె , పిప్పళ్ల పొడి (1 భాగం), మిరియం పొడి, లవంగాల పొడి, జీలకర్ర పొడి కలిపి గొంతు తగిలేలా పుక్కిట పడితే గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

పెదవుల పగుళ్లు:2 భాగాల తేనెకు 1 భాగం మీగడను, నాలుగైదు చుక్కలు రోజ్ వాటర్‌ని కలిపి పెదవుల మీద ప్రయోగిస్తే పెదవుల పగుళ్లు తగ్గి నున్నగా తయారవుతాయి.

పిల్లల్లో విరేచనాలు:తేనెకు జాజికాయ పొడిని కలిపి ఇస్తే అతిసారం తగ్గుతుంది.

వ్యాధి నిరోధకశక్తి పెరగడానికి:3 భాగాల తేనెకు 1 భాగం దాల్చిన చెక్క పొడిని కలిపి పుచ్చుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

పంటి నొప్పి లేదా దంతశూల:3 భాగాల తేనెకు 1 భాగం దాల్చిన చెక్క పొడిని కలిపి చిగుళ్ల పైన ప్రయోగిస్తే వాపు తగ్గి దంతశూల నుంచి ఉపశమనం లభిస్తుంది.

స్థూలకాయం:చెంచాడు దాల్చిన చెక్క పొడిని 2 గ్లాసుల నీళ్లకు చేర్చి అరగ్లాసు కషాయం మిగిలేంతవరకూ మరిగించాలి. దీనికి మూడు టీస్పూన్లు తేనెను కలిపి ఆహారానికి అరగంట ముందు రెండు పూటలా పుచ్చుకుంటూ ఉంటే స్థూలకాయంలో మంచి ఫలితం కనిపిస్తుంది.

మృతకణాలను తొలగించడానికి:తేనెను బాదం పప్పు పొడికి కలిపి పేస్టుగాచేసి ముఖం మీద ప్రయోగించి రుద్దుకోవాలి. ఇది చక్కని స్క్రబ్‌గా పనిచేస్తుంది. చర్మంమీద పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

ముఖ చర్మం స్నిగ్ధంగా తయారుకావడానికి:తేనె (3 భాగాలు), కోడిగుడ్డు తెల్లసొన (1 భాగం), గ్లిజరిన్ (1 భాగం), మసూర్‌దాల్ (ఎర్ర కందిపప్పు) తగినంత… ఈ నిష్పత్తిలో కలిపి ముఖంమీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగించాలి.

వృద్ధాప్యం:వృద్ధాప్య సమస్యల్లో తేనె చక్కగా ఉపయోగపడుతుంది. తేనె జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని సేద తీరేలా చేస్తుంది. మెదడును నిశ్శబ్దపరుస్తుంది. చర్మాన్ని బిగువుగా చేస్తుంది. చిన్నపాటి నొప్పులను దూరంచేస్తుంది.

ఒక జగ్గులో 3 కప్పుల తేనెను, 2 కప్పుల సిడర్ వెనిగార్‌ని, 1 కప్పు నీళ్లను కలపాలి. దీనిని ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు చొప్పున తాగుతుంటే వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉంటుంది.

రక్తహీనత:ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉన్నవారు, హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నవారు తేనెను వాడి ప్రయోజనం పొందవచ్చు. తాజా ఆకుకూరల మీద తేనెను పరిచి తీసుకుంటుంటే హితకరంగా ఉంటుంది. రక్తహీనత క్రమంగా దూరమవుతుంది.

కీళ్లనొప్పి:1 లీటరు వేడి నీళ్లకు 1 కప్పు తేనెను, అరకప్పు నిమ్మ రసాన్ని చేర్చి నూలు గుడ్డను ముంచి నొప్పి, వాపు ఉన్నచోట కీలుమీద పరిస్తే ఉపశమనం లభిస్తుంది.

నోటి దుర్వాసన: ఒక బాటిల్‌లో మూడువంతులు సిడర్ వెనిగార్‌ని నింపి, కప్పు తేనెను కలపాలి. బాగా గిలకొట్టాలి. దీనిని ఆహారం తర్వాత వౌత్‌వాష్‌గా పుక్కిట పట్టాలి. చివరగా నీళ్లతో పుక్కిలించాలి. దీంతో నోటి దుర్వాసన దూరమవుతుంది.

శయ్యామూత్రం (బెడ్ వెట్టింగ్):చిన్నపిల్లలు పక్క తడుపుతున్నప్పుడు రెండు టీ స్పూన్ల తేనెను పిల్లలకు రెండుపూటలా ఇస్తుండాలి. సాయంత్రం అదనపు నీళ్లను నియంత్రించాలి.

సెగ గడ్డలు:రెండు చెంచాలు తేనెను, కోడిగుడ్డు తెల్లసొనను, గోధుమ పిండిని కలిపి పేస్టుమాదిరిగా చేసి సెగ్గడ్డమీద పూసి పైన గుడ్డతో కట్టుకట్టాలి. రాత్రి పగలూ సెగ గడ్డ పగిలి చీము స్రవించేవరకూ దీనిని మార్చుతుండాలి.

బ్రాంకైటిస్, దగ్గు:తేనెను వేడి పాలకు గాని, కాఫీకి గాని లేదా టీకి గాని కలిపి పుచ్చుకుంటే గొంతులో అసౌకర్యంలో ఊపిరితిత్తుల్లో పట్టేసినట్లు ఉండటం తగ్గుతుంది

పొడి దగ్గు:చెంచాడు అల్లం రసానికి చెంచాడు తేనెను కలిపి మూడు పూటలా పుచ్చుకుంటూ వుంటే దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది

కాలిన గాయాలు:స్టౌవద్ద కాలిన గాయాలకు, వేడి నీళ్లుపడటంవల్ల కాలిన గాయాలకు తేనెను నేరుగా ప్రయోగించవచ్చు. గాటుపడకుండా గాయం మానుతుంది.

చర్మం పగుళ్లు:మోచేతులు, పాదాల వంటి భాగాల్లో చర్మం పగిలి ఇబ్బందిని కలిగిస్తుంటే తేనె, నిమ్మరసం ఆలివ్ నూనె కలిపి పేస్టులా చేసి ప్రయోగించాలి.

తేనె వాడకూడని సందర్భాలు….

మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తేనెను వాడాలి.

తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు. అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి నేరుగా వాడకూడదు. తేనెను మరిగించకూడదు.

తేనె ఉష్ణ వీర్య పదార్థం కాబట్టి తేనెను నేరుగా మంటపైన వేడిచేయకూడదు. తేనెను వేడి వాతావరణంలోనూ, ఎండాకాలంలో పరిమితంగానే వాడాలి. (తేనెలో రకరకాల పువ్వుల మకరందాల అంశ ఉంటుంది. వీటిల్లో విష పుష్పాలు సైతం ఉంటాయి. .)

మసాలా పదార్థాలతోనూ, మద్యంతోనూ, ఆవనూనె వంటి పదార్థాలతోనూ కలపకూడదు.

తేనెను వర్షం నీళ్లతో కలిపి వాడకూడదు.

తేనెను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచితే పంచదార స్పటికాలు తయారవుతాయి. అలాంటి సందర్భాల్లో ఎండలో ఉంచితే సరిపోతుంది. లేదా తేనె సీసాను వేడి నీళ్లలో పెట్టి పరోక్షంగా వేడిచేస్తే తేనె స్పటికాలు కరిగి తిరిగి తేనె తయారవుతుంది.
తేనెను, నెయ్యిని సమాన భాగాలుగా తీసుకోకూడదు (సంయోగ విరుద్ధం).

Related posts

4 Tips for Finding the Right ENT Specialist Online

beautyadmin

Peptide Rich Diet Options: Things To Know About Natural Peptides

beautyadmin

The five best applications to control the menstrual cycle

beautyadmin

Leave a Comment